Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:35 AM

ఘనంగా రామన్నపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

06-04-2026 88 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ కన్నెకంటి వెంకటేశ్వరాచారి మాట్లాడుతూ… శ్యామా ప్రసాద్ ముఖర్జీ వేసిన బలమైన పునాదులపై పార్టీ నిర్మితమైందన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాద సిద్ధాంతంతో, సమాజంలోని చివరి వ్యక్తికీ ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ లక్ష్యంతో బీజేపీ ముందుకు సాగుతోందని తెలిపారు.

‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ అనే నినాదంతో, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ వంటి అగ్రనేతల మార్గదర్శకత్వంలో, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మడూరి ప్రభాకర్ రావు, కట్కూరి బిక్షపతి, కొమ్ము యాదయ్య, కూనూరు సుధాకర్, ఏలూరు రవి, యాదాసు లక్ష్మణ్, గుండాల అంజయ్య, కొడారి వెంకటేష్ యాదవ్, గుంటోజు కృష్ణమాచారి, అక్కినపల్లి సైదులు, నడిగోటి సైదులు, మందడి శ్రీధర్ రెడ్డి, శుభకోటి శశి, కర్నాటి నరేష్, వడ్డేపల్లి అంబదాస్, దావునూరి గురిగి బీరప్ప, గొరిగే బాలకృష్ణ, అజయ్, కానుకుర్తి అంజయ్య, ఏరువా సాయి, కట్కూరి అరవింద్, కన్నెగంటి వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా రామన్నపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News