Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి

11-04-2026 119 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: సామాజిక విప్లవకారుడు, అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతిని రామన్నపేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సుభాష్ సెంటర్ వద్ద పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జయంతి ఉత్సవ కమిటీ కో-కన్వీనర్ నాగటి ఉపేందర్, గౌరవ సలహాదారు నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాలకు అక్షరజ్ఞానం అందించి సామాజిక సమానత్వం కోసం పోరాడిన మహనీయుడు పూలే అని కొనియాడారు. 199 ఏళ్లు పూర్తి చేసుకుని 200వ జయంతి ఉత్సవాల్లోకి అడుగుపెడుతున్న ఈ సందర్భంగా ఆయన ఆశయాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలిపారు.

కుల వివక్ష లేని సమాజం, మహిళా విద్య కోసం పూలే చేసిన కృషి చిరస్మరణీయమని, పూలే–అంబేద్కర్ ఆశయాల సాధనకే నిజమైన నివాళి అవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర నరేష్, కమిటీ సభ్యులు గాదె నరేందర్, నోముల చిరంజీవి, నాగటి యాదయ్య, గన్నబోయిన విజయభాస్కర్, యాదాసు యాదయ్య, బాదే అశోక్, నకిరేకంటి నరేష్, నరసింహ, కర్నే వినయ్, నోముల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఘనంగా పూలే జయంతి – సమానత్వం కోసం కృషి చేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News