Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:49 AM

గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు

09-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని రీజినల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ స్టడీస్‌లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు.

యువ ఆపద మిత్ర వాలంటీర్లకు నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో అగ్ని ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, గుండెపోటు వచ్చినప్పుడు సీపీఆర్ విధానం, వరదల సమయంలో ప్రజలను రక్షించే పద్ధతులు, భూకంపాలు, సునామీ వంటి విపత్తుల సమయంలో బాధితులకు సహాయం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధానాలపై వారం రోజులపాటు శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తిచేసుకున్న వాలంటీర్లకు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవి వర్మ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందుకున్న విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ అభినందించారు. కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు నర్సింగ్ కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, బొజ్జ అనిల్ కుమార్, డాక్టర్ అదె మల్లేశం, కంభంపల్లి శివరాణి, ఎం. సావిత్రి తదితరులు పాల్గొన్నారు.

యువ అపదమిత్ర వాలంటీర్స్ ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్

Sthanikam

గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్న ఎన్జీ కళాశాల విద్యార్థులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News