Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:12 AM

గౌస్‌నగర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

27-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా గౌస్‌నగర్ గ్రామంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు జంగారెడ్డి, ప్రధాన కార్యదర్శి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనంతరం రాజకీయ పార్టీగా మారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందని నాయకులు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గ్రామంలో వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నాయకులు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామాభివృద్ధి కోసం ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ వీళ్ళ కృష్ణ పుష్ప, మాజీ ఉపసర్పంచ్ రెడ్డి, నల్ల వాజ్ కుమార్, మల్లేష్ గౌడ్, మాజీ వార్డ్ సభ్యుడు సిద్దులు యాదవ్, వెంకటేష్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం నినాదాలతో ఉత్సాహభరితంగా సాగింది.

Sthanikam

గౌస్‌నగర్‌లో ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News