Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!
02-04-2026 151 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాశ్వత కట్టడాలకు యత్నం.. గ్రామసభలో వినతి.

రామన్నపేట: ప్రభుత్వ గ్రంథాలయానికి ఆనుకొని ఉన్న భూమిపై ఇతరులు కన్నేసి శాశ్వత కట్టడాలు నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై గ్రంథాలయ ఉద్యోగి కట్కురి నరసింహ గురువారం నిర్వహించిన గ్రామసభలో గ్రామ కార్యదర్శి సైదిరెడ్డికి వినతి పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రంథాలయానికి సంబంధించిన భూమిలోనే కొత్త భవనం నిర్మించినప్పటికీ, ప్రహరీ గోడ మరియు మూత్రశాలల నిర్మాణం నిధుల లేమితో ఇంకా పెండింగ్‌లోనే ఉందని తెలిపారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కొందరు వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించి శాశ్వత కట్టడాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రంథాలయానికి చెందిన ఆస్తిని రక్షించే బాధ్యత అధికారులపై ఉందని, ఆక్రమణదారులకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని వినతి పత్రంలో కోరినట్లు ఆయన వెల్లడించారు.

గ్రామసభలో ఈ అంశం చర్చనీయాంశంగా మారగా, సంబంధిత అధికారులు స్పందించి భూమి రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.

Sthanikam

గ్రంథాలయ భూమిపై కన్నేశారు!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News