గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
గ్రామ సభలను విజయవంతం చేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
Vikram Journalist
ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై రైతులకు అవగాహన కల్పించాలి – నకిలీ విత్తనాలపై టాస్క్‌ఫోర్స్ నిఘా పెంచాలి.
జిల్లావ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల పాటు నిర్వహించే గ్రామ సభలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అధికారులకు సూచించినట్లు తెలిపారు. సోమవారం గ్రామ సభలు, శానిటేషన్, తాగునీరు, సీజనల్ వ్యాధుల నివారణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ అంశాలపై జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మండలాల వారీగా ఎంపీడీవోలు, తహసీల్దార్లు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి గ్రామ సభలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలోని అన్ని శాఖల సిబ్బందితో పాటు మండల స్థాయి అధికారులు కూడా తప్పనిసరిగా గ్రామ సభల్లో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. రైతు వేదికల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నట్లు తెలిపారు.
రైతులకు పూర్తి స్థాయిలో లబ్ధి చేకూర్చేందుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియపై ప్రత్యేక అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రైతులకు సులభంగా అర్థమయ్యే విధంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను వివరించాలని, సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించినట్లు తెలిపారు. జిల్లాలో 72 శాతం ఫార్మర్ రిజిస్ట్రేషన్ పూర్తి చేసి రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిచినందుకు వ్యవసాయ శాఖ అధికారులను అభినందించినట్లు తెలిపారు. వానాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్ బృందాలు గట్టి నిఘా పెట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. యూరియా వినియోగం పెరగడంపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి రైతులకు సరైన మార్గదర్శనం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులకు సూచించినట్లు తెలిపారు. వర్షాకాలానికి ముందస్తు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడంతో పాటు అవసరమైతే ప్రత్యామ్నాయ కార్యాచరణ కూడా రూపొందించుకోవాలని పేర్కొన్నట్లు తెలిపారు. వర్షాకాలంలో కలుషిత నీటి సమస్యలు తలెత్తకుండా స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్యం, డ్రైనేజీల శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వన మహోత్సవం నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ప్రణాళికలపై సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించినట్లు తెలిపారు.
జిల్లా ఎస్పీ కె. నరసింహ మాట్లాడుతూ గ్రామ సభలు, వార్డు సభలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ శాఖ పూర్తి సహకారం అందిస్తుందని పేర్కొన్నట్లు తెలిపారు. గ్రామ సభల సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళలు, బాలల భద్రత, యాంటీ డ్రగ్స్, రోడ్డు భద్రత, చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నట్లు తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ బి. హరి సింగ్, డీఆర్డీఓ సన్యాసయ్య, జడ్పీ సీఈవో శిరీష, డీఎఫ్‌వో దామోదర్ రెడ్డి, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్ రెడ్డి, సీపీఓ కిషన్, జిల్లా ఫైర్ అధికారి కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులు పాల్గొన్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి