Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:52 AM

గన్‌పార్క్‌కు ఉద్యమకారుల ర్యాలీ… భారీగా పాల్గొనాలని జోగు అంజన్న పిలుపు

10-03-2026 271 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని Gun Park వద్ద నిర్వహించనున్న ‘చలో గన్‌పార్క్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పిలుపునిచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడు Dr Cheem Srinivas ఆధ్వర్యంలో మార్చి 10న ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మిలియన్ మార్చ్‌లో రాష్ట్రంలోని 33 జిల్లాల ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన Million March 2011 Telanganaను స్ఫూర్తిగా తీసుకుని అమరులైన ఉద్యమకారులను స్మరించుకునే కార్యక్రమంగా దీన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రభుత్వం మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారికి గుర్తింపు కార్డులు జారీ చేయాలని, 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.10 వేల కోట్లతో ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి, రైళ్లు, బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమం అనంతరం హైదరాబాద్‌లోని Bashirbagh Press Clubలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యమకారిణులకు ఘనంగా సన్మానం చేయనున్నట్లు తెలిపారు.

ఈ విషయాన్ని జోగు అంజన్న విలేకరుల సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి, యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కళాకారుల సంఘం మల్లం వెంకన్న, సీనియర్ ఉద్యమకారులు కొండూరు సత్తయ్య, కన్నెగంటి శ్రీనివాసచారి, పల్లెర్ల రామచంద్రం, పారుపల్లి నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గన్‌పార్క్‌కు ఉద్యమకారుల ర్యాలీ… భారీగా పాల్గొనాలని జోగు అంజన్న పిలుపు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News