Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

04-04-2026 57 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర కార్యసాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా ఖండించారు. నకిరేకల్‌లో విలేఖరులతో మాట్లాడిన ఆయన, ఈ ఘటనను “పిరికిపంద దాడి”గా అభివర్ణించారు.

గజ్వేల్‌లో కేసీఆర్ క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయడం రాష్ట్రంలో దిగజారుతున్న లా అండ్ ఆర్డర్ పరిస్థితికి నిదర్శనమని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు గత రెండేళ్లుగా వివిధ రూపాల్లో అరాచకాలకు పాల్పడుతూ రాష్ట్రంలో గందరగోళం సృష్టిస్తున్నారని ఆరోపించారు.

ఉద్యమ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ సొంత నియోజకవర్గంలోనే ఆయన క్యాంప్ కార్యాలయంపై దాడి జరగడం రాష్ట్ర పరిస్థితుల తీవ్రతను తెలియజేస్తోందన్నారు. పోలీసుల వ్యవహారశైలిపై కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వారు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

ఇలాంటి దాడులతో కేసీఆర్ అనుచరులు ఏమాత్రం భయపడరని స్పష్టం చేసిన లింగయ్య, ప్రజలు ఈ సంఘటనలను గమనిస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచకాలకు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు.

Sthanikam

గజ్వేల్ ఘటనపై బీఆర్‌ఎస్ ఆగ్రహం.. కాంగ్రెస్‌పై చిరుమర్తి తీవ్ర విమర్శలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News