Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 12:07 AM

ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలి: జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలి: జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి

ఆర్థిక ప్రజాస్వామ్యం కూడా సాధించాలి: జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి
April 09, 2026 09:09 PM 26 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: రాజకీయ ప్రజాస్వామ్యంతో పాటు ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా సాధించడం అత్యవసరమని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ అర్థశాస్త్ర విభాగం, చంచల్‌గూడ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న “ఆర్థిక సంస్కరణలు, భారత రాజ్యాంగం: విభేదాలు, భవిష్యత్ దిశ” అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సును ఆయన గురువారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ డా. బి. ఆర్. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ రూపశిల్పి మాత్రమే కాకుండా ప్రముఖ ఆర్థికవేత్త అని తెలిపారు. రాజ్యాంగంలో సమానత్వం, న్యాయం వంటి విలువల్లో సామ్యవాద స్ఫూర్తి ప్రతిఫలిస్తుందని చెప్పారు. 1946 కరాచీ తీర్మానం సామాజిక-ఆర్థిక హక్కులకు పునాది వేసిందని, అనంతరం జరిగిన రాజ్యాంగ సవరణలు ఆర్థిక అసమానతలపై దృష్టి సారించాయని పేర్కొన్నారు. జమీందారీ వ్యవస్థ రద్దు వంటి చర్యలు సమానత్వ దిశగా కీలకమని అన్నారు. దేశంలో ఫాసిజం కొత్త రూపాలపై ఆందోళన వ్యక్తం చేశారు.

సదస్సుకు అధ్యక్షత వహించిన వైస్ ఛాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ, ఉన్నత విద్యలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా రాజ్యాంగ విలువలను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల పెరుగుదలతో విద్య అందుబాటులో తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజీసీ నిధుల తగ్గింపు ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రభావం చూపుతోందని చెప్పారు.

ప్రధాన వక్తగా పాల్గొన్న జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొ. ప్రభాత్ పట్నాయక్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో సంక్షేమాన్ని కాపాడాలంటే కీలక రంగాలపై ప్రభుత్వ నియంత్రణ అవసరమని అన్నారు. దేశ సంపదలో పెద్ద భాగం కొద్ది మందికే కేంద్రీకృతమవుతోందని, అసమానతలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సంక్షేమ రాజ్య నిర్మాణానికి పన్ను సంస్కరణలు, ప్రాథమిక ఆర్థిక హక్కుల అమలు అవసరమని సూచించారు.

అకడమిక్ డైరెక్టర్ ప్రొ. జి. పుష్పా చక్రపాణి సామాజిక న్యాయం ప్రాముఖ్యతను వివరించగా, సెమినార్ డైరెక్టర్ ప్రొ. పి. వెంకటేశ్వర్లు, కో-డైరెక్టర్ ప్రొ. కృష్ణారెడ్డి తదితరులు ఆర్థిక విధానాలు రాజ్యాంగ సూత్రాలకు అనుగుణంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.

కార్యక్రమంలో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News