Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:37 AM

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం

10-04-2026 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్-2025 ఫలితాల్లో ఐఏసీఈ సంస్థ ఆల్ ఇండియా స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించి మరోసారి తన ప్రతిభను చాటుకుంది. టాప్ ర్యాంకులతో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తూ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో ప్రముఖ స్థానం దక్కించుకుంది.

ఈ సందర్భంగా ఐఏసీఈ చైర్మన్ వినయ్ కుమార్ రెడ్డి, డైరెక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించి, కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.

వారు మాట్లాడుతూ… 2025 ఫలితాల్లో ఐఏసీఈ మరోసారి చరిత్ర సృష్టించిందని తెలిపారు. ఆల్ ఇండియా స్థాయిలో 54, 59, 120, 287, 324, 349 వంటి ప్రముఖ ర్యాంకులు సాధించడం విశేషమన్నారు. ఈ ఫలితాలతో తెలుగు రాష్ట్రాల ప్రతిష్ఠను జాతీయ స్థాయిలో నిలబెట్టామని పేర్కొన్నారు.

తరగతి గది శిక్షణ, విశ్లేషణాత్మక మాక్ టెస్టులు, ఇంటెన్సివ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థులను సమర్థంగా తయారుచేసిన ఫలితంగానే ఈ విజయాలు సాధ్యమయ్యాయని వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐఆర్ఎఫ్ (ఐఏసీఈ రిజల్ట్స్ ఫ్యాక్టరీ) కీలక పాత్ర పోషించిందన్నారు.

ఈ చారిత్రక విజయంపై ఆనందం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్న అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ఫలితాల్లో ఐఏసీఈ ప్రభంజనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News