Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:24 PM

ఏసీబీ చిక్కిన దేవరకొండ విద్యుత్ ఏడీఈ..

ఏసీబీ చిక్కిన దేవరకొండ విద్యుత్ ఏడీఈ..

ఏసీబీ చిక్కిన దేవరకొండ విద్యుత్ ఏడీఈ..
16-04-2026 42 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సైదులు..

రూ. 30 వేలు స్వాధీనం చేసుకున్న అధికారులు..

దేవరకొండ: అవినీతి రహిత పాలన సాగాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కొందరు అధికారులు మాత్రం తమ తీరు మార్చుకోవడం లేదు. నల్గొండ జిల్లా దేవరకొండ విద్యుత్ శాఖ (TSSPDCL) కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. ఒక పనికి సంబంధించిన ఫైలును క్లియర్ చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు లంచం తీసుకుంటూ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ (ఏడీఈ) సైదులు పట్టుబడ్డారు.

విశ్వసనీయ సమాచారం మేరకు.. ఒక విద్యుత్ పనులకు సంబంధించిన ఫైలును ముందుకు కదిలించేందుకు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ఏడీఈ సైదులు ఒక కాంట్రాక్టర్‌ను లంచం డిమాండ్ చేశారు. సదరు కాంట్రాక్టర్ తాను అంత మొత్తం ఇచ్చుకోలేనని మొరపెట్టుకున్నా అధికారి కనికరించలేదు. చివరకు గత్యంతరం లేక బాధితుడు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ బృందం పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగింది. గురువారం దేవరకొండలోని తన కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ. 30 వేలు నగదు తీసుకుంటుండగా ముందస్తు నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు మెరుపు దాడి చేశారు. సైదులు నుంచి నగదును స్వాధీనం చేసుకుని రసాయన పరీక్షలు నిర్వహించగా ఫలితం సానుకూలంగా వచ్చినట్లు తెలిసింది. ఏడీఈ సైదులును అదుపులోకి తీసుకున్న అధికారులు కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు. ఆయన నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అవినీతికి పాల్పడే అధికారులు ఎంతటి వారైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబరుకు ఫిర్యాదు చేయాలి...ఏసీబీ అధికారులు

Sthanikam

ఏసీబీ చిక్కిన దేవరకొండ విద్యుత్ ఏడీఈ..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News