Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ఏప్రిల్ 6 నుంచి జిల్లాలో ‘హెల్త్ వీక్’ కార్యక్రమాలు. కలెక్టర్

04-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలో ఏప్రిల్ 6 నుంచి 11 వరకు “హెల్త్ వీక్” కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో కార్యక్రమాల అమలుపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) భాస్కర్ రావు పాల్గొన్నారు.

హెల్త్ వీక్‌లో భాగంగా ప్రతి రోజుకు ప్రత్యేక థీమ్‌తో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ ఫోకస్ డే సందర్భంగా భువనగిరిలో ఈట్ రైట్ వాక్, అవగాహన ర్యాలీలు, కల్తీ పరీక్షల ప్రదర్శనలు నిర్వహించనున్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా వైద్య సిబ్బందికి అవార్డులు ప్రదానం చేయనున్నారు.

సేఫ్ మదర్ డే రోజున గర్భిణీలు, బాలింతలకు ప్రత్యేక సేవలు, గ్రామస్థాయిలో ఆరోగ్య శిబిరాలు నిర్వహించనున్నారు. 28 రోజులలోపు శిశువులు, బాలింతలను గుర్తించి ఇంటింటి సందర్శనల ద్వారా ఆరోగ్య సేవలు అందించేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా డయాగ్నస్టిక్ సెంటర్‌లో ఉచిత పరీక్షలపై గ్రామస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు.

ఎయిడ్స్ అవగాహన దినం సందర్భంగా రెడ్ రన్, స్క్రీనింగ్ క్యాంపులు, విద్యార్థులకు పోటీలు నిర్వహించనున్నారు. హోమియోపతి దినోత్సవం సందర్భంగా మెగా ఆయుష్ వైద్య శిబిరం, యోగా కార్యక్రమాలు చేపట్టనున్నారు.

డ్రగ్స్ కంట్రోల్ డే రోజున డ్రగ్ దుర్వినియోగ నియంత్రణపై అవగాహన ర్యాలీలు, కళాశాలల్లో వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించనున్నారు. అలాగే ఆసుపత్రుల్లో మత్తు పదార్థాల నివారణ సేవలను సమీక్షించనున్నారు.

జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి హెల్త్ వీక్ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి రోజు కార్యక్రమాలపై నివేదికలు సమర్పించాలని సూచించారు.

ఇక NQAS ప్రమాణాల సాధన కోసం ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఇంజనీర్లను కేటాయించి, పెండింగ్ సివిల్ పనులపై అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారులు, వివిధ శాఖల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఏప్రిల్ 6 నుంచి జిల్లాలో ‘హెల్త్ వీక్’ కార్యక్రమాలు. కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News