Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:24 AM

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

22-04-2026 62 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట,: ఈ నెల 24న భువనగిరిలోని సుందరయ్య భవనంలో జరిగే ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ పిలుపునిచ్చారు.

మండల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా 17 మండలాల నుంచి పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొనాలని కోరారు. ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, వికలాంగులకు నెలకు రూ.6,000 పెన్షన్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

వికలాంగులకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి గ్రామంలో ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులను నియమించాలని సూచించారు. జిల్లాలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్న వికలాంగులకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

అలాగే చదువుకున్న నిరుద్యోగులకు నెలకు రూ.4,016 నిరుద్యోగ భృతి ఇవ్వాలని, బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేసి ఉద్యోగావకాశాలు కల్పించాలని, అంత్యోదయ రేషన్ కార్డుతో 35 కిలోల బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. మహిళా వికలాంగులకు ఇంటి వద్దే ఉపాధి కల్పించే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో మండల కార్యదర్శి గిరికల లింగస్వామి, ఉపాధ్యక్షుడు నాగు నరసింహ, సహాయక కార్యదర్శి పున్న శ్రీధర్, నాయకులు కుందూరు వెంకటేశం, పున్న సదానందం, వంగాల నరసింహ, పగిల రమేష్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఎన్‌పీఆర్‌డీ జిల్లా క్లాసులకు హాజరుకావాలి. వనం ఉపేందర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News