Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు

06-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలలో ఎన్నారం జెడ్పీహెచ్‌ఎస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. సల్ల వరూదిని (7వ తరగతి) ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ గెలుచుకోగా, శ్రీరాముల చందు (8వ తరగతి) ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ అందుకున్నాడు.

మోక్షిత్, మణి తేజ, అమృత (7వ తరగతి), రమాదేవి, శరణ్య (9వ తరగతి) తృతీయ స్థానాలు సాధించి బ్రాంజ్ పతకాలు, సర్టిఫికెట్లు అందుకున్నారు.

విద్యార్థుల విజయంపై ప్రధానోపాధ్యాయురాలు కమలాదేవి హర్షం వ్యక్తం చేస్తూ అభినందించారు. ఎస్కార్ట్ టీచర్ రమాబాయి, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులను ప్రశంసించారు. కరాటే మాస్టర్ ప్రసాద్ సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.

విద్యార్థుల విజయానికి సహకరించిన భాస్కర్ రెడ్డి, కొండూరు శంకర్, నీలం శేఖర్, బుచ్చి రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారం కొనసాగితే మరిన్ని విజయాలు సాధిస్తామని విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Sthanikam

ఎన్నారం విద్యార్థులకు కరాటేలో రాష్ట్ర స్థాయి విజయాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News