Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 02:47 AM

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్
09-03-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈకో క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు సలాడ్ తయారీపై అవగాహన వర్క్‌షాప్ నిర్వహించారు. నేషనల్ గ్రీన్ కోర్ప్స్మా ర్గదర్శకాల మేరకు సోమవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈకో క్లబ్ కన్వీనర్ వి. శిరీష మాట్లాడుతూ తాజా కూరగాయలు, పండ్లతో తయారుచేసే సలాడ్లు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయని తెలిపారు. సలాడ్ తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు అలవడతాయని విద్యార్థులకు సూచించారు.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. ఉపేందర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఉపయోగకరమని అన్నారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, ఆరోగ్యకరమైన జీవన విధానానికి ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ పరంగి రవి, డాక్టర్ అంతటి శ్రీనివాసులు, సీఓఈ డాక్టర్ మునుస్వామి, అధ్యాపకులు బత్తిని నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, ఈకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, డాక్టర్ పి. సిద్ధేష్ గౌడ్, డాక్టర్ డి. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్జీ కళాశాలలో సలాడ్ తయారీపై వర్క్‌షాప్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News