Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:35 AM

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

15-04-2026 28 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) మొదటి సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ మరియు పరీక్షల నియంత్రణ అధికారి డా. డి. మునిస్వామి బుధవారం విడుదల చేశారు.

2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎం.ఏ తెలుగు, అర్థశాస్త్రం, ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం, కంప్యూటర్ సైన్స్, జంతుశాస్త్రం, ఎం.కామ్ కోర్సుల ఫలితాలను కళాశాల అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. పీజీ మొదటి సెమిస్టర్ చదువుతున్న విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాలను పరిశీలించుకోవచ్చన్నారు.

ఈ ఏడాది ఫలితాల్లో విద్యార్థులు గణనీయమైన ప్రతిభ కనబరిచారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం మెరుగుపడినట్లు ప్రిన్సిపాల్ తెలిపారు. కోర్సులవారీగా ఉత్తీర్ణత శాతం ఇలా ఉంది:

ఎం.ఏ తెలుగు – 84%

ఎం.ఏ అర్థశాస్త్రం – 100%

ఎమ్మెస్సీ రసాయనశాస్త్రం – 18%

ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ – 68%

ఎమ్మెస్సీ జంతుశాస్త్రం – 84%

ఎం.కామ్ – 86%

ఫలితాలపై అసంతృప్తి ఉన్న విద్యార్థులు పది రోజులలోపు నిర్ణీత రుసుము చెల్లించి రీ-వాల్యుయేషన్ లేదా రీ-కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

పూర్తి ఫలితాల కోసం కళాశాల వెబ్‌సైట్‌ను సందర్శించవలసిందిగా కోరారు.

ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డా. పి. రవి కుమార్, ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, అకాడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, పీజీ ఇన్‌చార్జీలు డా. వెల్దండి శ్రీధర్, డా. జ్యోత్స్న, డా. జె. నాగరాజు, వెంకట్ రమణ, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎన్‌జీ కళాశాల పీజీ మొదటి సెమిస్టర్ ఫలితాల విడుదల

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News