Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కనకదుర్గ అమ్మవారి ఆలయంలో నేడు వైభవంగా పుష్పాభిషేకం నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 03, 2026 09:25 PM

ఎన్ హెచ్ 65పై మట్టి కట్ట వద్దు.. ఫ్లైఓవర్ నిర్మించాలి

17-04-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఎన్ హెచ్ఏఐ డైరెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల వినతి

​- మురుగునీటి సమస్య పరిష్కారానికి డ్రైనేజీ విస్తరణ చేపట్టాలి

​జాతీయ రహదారి (NH 65)పై ప్రస్తుతం ప్రతిపాదించిన మట్టి కట్ట నిర్మాణాన్ని రద్దు చేసి, దానికి బదులుగా పిల్లర్లపై ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాతీయ రహదారుల అథారిటీ (NHAI) ప్రాంతీయ కార్యాలయంలో డైరెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. మట్టి కట్ట వల్ల స్థానికంగా రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని, వ్యాపార సముదాయాలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆధునిక పద్ధతిలో పిల్లర్లతో కూడిన ఫ్లైఓవర్ నిర్మిస్తేనే ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు.రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్హెచ్ 65 పక్కన ఉన్న డ్రైనేజీ విస్తీర్ణాన్ని పెంచాలని ఆయన అధికారులకు సూచించారు.

​ఎమ్మార్వో ఆఫీస్ నుంచి ప్రారంభమై 12, 13వ వార్డుల మీదుగా వెళ్లే డ్రైనేజీ సమస్యపై అధికారులతో ప్రత్యక్షంగా చర్చించారు.​వర్షాకాలంలో నిలిచిపోయే నీటి వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను వివరించి, డ్రైనేజీ పైపుల సామర్థ్యాన్ని పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతల దామోదర్ రెడ్డి, బొమ్మిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉడుగు మల్లేశం గౌడ్, తాడూరి పరమేష్, గుండబోయిన వెంకటస్వామి, చెవగోని మహేష్‌, బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ప్రజల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డైరెక్టర్, క్షేత్రస్థాయిలో పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Sthanikam

ఎన్ హెచ్ 65పై మట్టి కట్ట వద్దు.. ఫ్లైఓవర్ నిర్మించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News