Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 03:42 AM

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

13-03-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ:

బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ యూనివర్సిటీలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నల్ల మధు యాదవ్, యూనివర్సిటీ అధ్యక్షుడు సాగర్ల కరుణాకర్ యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాల పాలనలో వివిధ వర్గాలకు ఎంత నిధులు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 15న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ‘ఫీజు ఫోర్’ దీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా అన్ని నియోజకవర్గాలు, మండలాలు, జిల్లా కేంద్రాల నుంచి విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సుమారు రూ.7,000 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్ లేదని చెప్పే ప్రభుత్వం కాంట్రాక్టర్లకు వేల కోట్ల రూపాయలు ఎలా చెల్లిస్తుందో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.

పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు విడుదల చేయకపోతే బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి నాయకులు సుధీర్, అనుముల సురేష్, శివ, నరేష్, వినయ్, రవి, విష్ణు, విజయ్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎంజీయూలో ‘ఫీజు ఫోర్’ దీక్ష పోస్టర్ ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News