Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:34 AM

ఈనాం భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆపాలి. పట్టాల కోసం తాసిల్దార్‌కు వినతి

09-02-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

కాకినాడ జిల్లా పత్తిపాడు మండల కేంద్రంలో చింతలూరు ఈనాం భూమి సమస్య పరిష్కారం చేసి సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని ప్రజా ప్రదర్శన ర్యాలీ మండల తాసిల్దార్ కు వినతి పత్రం సమర్పించగా సానుకూలంగా స్పందించినట్లు సిపిఐ ఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి కే జనార్ధన్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్, తెలియజేశారు.12న జరుగు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని మరియు 25 నఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు . కార్పొరేట్లకు అనుకూలంగా ఫాసిస్ట్ మోడీ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని విబి రాంజీ పథకాన్ని రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం ను యధావిధిగా కొనసాగించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయకుండా నిలిపివేయాలని ,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను స్కీం వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలని, స్వామినాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ ఆపాలని 12 గంటల పని దినాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని దినాన్ని యధావిధిగా కొనసాగించాలని కోరుతూ సిపిఐఎంఎల్ లిబరేషన్ నాయకులు మాట్లాడారు .దేశ సంపదను అంబానీ ఆదాని లాంటి కార్పొరేట్లకు అప్పచెప్పే విధంగా భవిష్యత్తులో పేదలు మరింత పేదలుగా మారి పొట్టకూటికోసం సుదూర ప్రాంతాలకు వలస పోయే విధంగా కేంద్ర రాష్ట్ర కూటమి ప్రభుత్వాలు తన విధానాలని ప్రజల మీద రుద్దుతున్నారని హరినాథ్ విమర్శించారు. కార్యక్రమంలోఏగుపాటి అర్జునరావు, మానుకొండ లచ్చ బాబు, జిల్లా కమిటీ సభ్యులు తాడి నాగేశ్వరరావు, రాజాల రత్నం ఈరటా నాగ సూర్య కుమారి, చిన్నం అర్జునుడు, బీరా దేవతయ్య, వరికూటి లోవమ్మా, బండి రత్నం తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఈనాం భూములపై ప్రభుత్వ నిర్లక్ష్యం ఆపాలి. పట్టాల కోసం తాసిల్దార్‌కు వినతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News