Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 01:37 AM

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం
25-02-2026 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పి.ఎస్.యు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ

నల్గొండ, : ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (పి.ఎస్.యు) ప్రథమ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరించారు. కార్యక్రమం మహేందర్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ మచ్చ వంశి, సహ కన్వీనర్ నల్లగంతుల అజయ్ మాట్లాడుతూ… విద్యారంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నడుమ ప్రగతిశీల ఆలోచనలతో గత ఏడాది ఫిబ్రవరి 25న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు కలసి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్‌ను స్థాపించారని తెలిపారు.

సంఘం ఆవిర్భావం నుంచి విద్యా సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శాస్త్రీయ, సమాన విద్య కోసం గత యాభై ఏళ్లలో పోరాడి అమరులైన విద్యార్థుల ఆశయాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలకు పక్కా భవనాలు నిర్మించాలని కోరారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తూ కామన్ స్కూల్ విధానం అమలు చేయాలని, విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పెండింగ్ ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలని, రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ నియామకాలు చేపట్టి అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.

కార్యక్రమంలో ఎస్. అనిల్ కుమార్, నిరంజన్, ఎస్. ప్రవీణ్, కె. మనీష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విద్యార్థి అమరవీరుల ఆశయాలకు అంకితం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News