Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:39 AM

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

09-04-2026 58 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: ప్రభుత్వ పాఠశాలల విద్యా ప్రమాణాలను పటిష్టం చేయాలంటే తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసులను వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని బాలల హక్కుల పరిరక్షణ వేదిక ఉమ్మడి నల్లగొండ జిల్లా సమన్వయకర్త ఎర్ర శివరాజ్ కోరారు.

గురువారం భువనగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాల/పాఠశాల ఆవరణలో వేదిక సభ్యులు, విద్యార్థులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత దశాబ్ద కాలంగా పాఠశాల విద్యా ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పాలకుల నిర్లక్ష్యం, తగిన బడ్జెట్ కేటాయింపుల లేమి కారణంగా ప్రాథమిక, ఉన్నత విద్యా ప్రమాణాలు దిగజారాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ పాఠశాలలను సందర్శించి రూపొందించిన సిఫారసులను వెంటనే అమలు చేయాలని కోరారు.

కమీషన్ సిఫారసులపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాటిని పూర్తిగా చదివి అవగాహన చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వేదిక జిల్లా నాయకులు జంపాల అంజయ్య, ఆవుల వినోద్ కుమార్, ఒగ్గు క్రిస్టోఫర్, కొడారి వెంకటేష్, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

విద్యా కమిషన్ సిఫారసులు అమలు చేయాలి. ఎర్ర శివాజీ రాజ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News