Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:34 PM

దోతిగూడెం,అంత్తమ్మగూడెం గ్రామాలలో ఉన్న కెమికల్ పరిశ్రమలను ఎత్తివేయాలి

21-04-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ డిమాండ్

భూదాన్ పోచంపల్లి: దోతిగూడెం,అంతమ్మగూడెం గ్రిమాలలోని ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కెమికల్ పరిశ్రమలను తక్షణం తోలగించాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు.మంగళవారం పోచంపల్లి మండలం పరిధిలోని దోతిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం ముందు సీపీఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో రసాయన పరిశ్రమలు తోలగించాలని నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ...కెమికల్ పరిశ్రమల వ్యర్ధాలు భూమిలోకి చేరి నీళ్లలో కలిసి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వెలిబుచ్చారు. ఈ కలుషితం వల్ల తాగు నీటి సమస్యతో పాటు ప్రజలు ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిశ్రమల కాలుష్యం వల్ల ప్రజలకు క్యాన్సర్ మరియు చర్మ వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇతర తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. మరోపక్క వ్యవసాయం కూడా దెబ్బతిని పంట నష్టం జరుగుతుందని అన్నారు. దోతిగూడెం,అంతమ్మగూడెం గ్రామాలలో 200 ఎకరాలకు పైగా రైతులు ప్రతీ పంటకు పంట నష్టపోతున్నారని అన్నారు. ఈ కెమికల్ పరిశ్రమల వల్ల పాడి రైతులు,కూరగాయల రైతులు,పండ్ల తోటల రైతుల తోపాటు గీత కార్మికులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ పరిశ్రమల వల్ల నిత్యము ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని తమ జీవనోపాధి,జీవితాలనే కోల్పో వస్తుందని ఆందోళన చెందుతున్నారని నర్సింహ తెలిపారు. పరిశ్రమల యజమానులు పరిశ్రమలలో నిబంధనలు పాటించకుండా ఇష్టం వచ్చిన రీతిగా వాయు కాలుష్యాన్ని,జల కాలుష్యాన్ని చేస్తున్నారని దీనిని నియంత్రించవలసిన తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి,స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ,ప్రజా ప్రతినిధులు పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. తక్షణం ఈ రెండు గ్రామాల్లో ఉన్న 11 రసాయన పరిశ్రమలను ఎత్తివేయాలని లేకపోతే సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని నర్సింహ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్,మాజీ మండల కార్యదర్శులు పగిళ్ల లింగారెడ్డి,ప్రసాదం విష్ణు,పట్టణ కార్యదర్శి దుబ్బాక జగన్,మండల కార్యదర్శివర్గ సభ్యులు మంచాల మధు పాల్గొని మాట్లాడగా ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి ముద్దం సత్తయ్య,సీపీఎం నాయకులు గుర్రం రామచంద్రారెడ్డి,వడ్డేపల్లి యాదగిరి,బుగ్గ లక్ష్మయ్య,పోన్నమోని కృష్ణ,పగిళ్ళ వేణుగోపాల్ రెడ్డి,యాస మల్లారెడ్డి,పగిళ్ల పాండురెడ్డి,చుక్క రజినీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి మెమోరండం ఇచ్చినారు.

Sthanikam

దోతిగూడెం,అంత్తమ్మగూడెం గ్రామాలలో ఉన్న కెమికల్ పరిశ్రమలను ఎత్తివేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News