Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల సంక్షేమమే లక్ష్యం.. హాస్టళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్యే సంజీవరెడ్డి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:28 PM

డిగ్రీ తర్వాత కెరీర్‌పై అవగాహన సదస్సు

డిగ్రీ తర్వాత కెరీర్‌పై అవగాహన సదస్సు

డిగ్రీ తర్వాత కెరీర్‌పై అవగాహన సదస్సు
11-03-2026 256 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్, : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్‌లో ప్రత్యేక కెరీర్ గైడెన్స్ సదస్సు నిర్వహించారు. కళాశాల కెరీర్ గైడెన్స్ అండ్ ప్లేస్‌మెంట్ సెల్, తెలంగాణ స్కిల్ అండ్ నాలెడ్జ్ సెంటర్, శ్రీధర్ ఇన్‌స్టిట్యూషన్ సంయుక్త ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థుల కోసం ఈ కార్యక్రమం జరిగింది.

కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. సురేష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత విద్యకు సంబంధించిన ప్రవేశ పరీక్షలకు సిద్ధమై తమ భవిష్యత్‌ను మెరుగుపర్చుకోవాలని సూచించారు. పీజీ కోర్సులు, పోటీ పరీక్షల ద్వారా మంచి ఉద్యోగ అవకాశాలు పొందవచ్చని తెలిపారు.

శ్రీధర్ ఇన్‌స్టిట్యూషన్ ఎండీ సంతోష్ రెడ్డి విద్యార్థులకు అందుబాటులో ఉన్న వివిధ కెరీర్ మార్గాలను వివరించారు. కెరీర్ ఎంపికలో సరైన మార్గదర్శకత్వం అవసరమని చెప్పారు.

కెరీర్ గైడెన్స్ సెల్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎ. దుర్గాప్రసాద్ వివిధ ఉన్నత విద్యా కోర్సులు, ప్రవేశ పరీక్షలు, విశ్వవిద్యాలయాల పరీక్షా విధానాలపై వివరించారు. తెలంగాణ స్కిల్ నాలెడ్జ్ సెంటర్ కోఆర్డినేటర్ డాక్టర్ డి. మక్లా మాట్లాడుతూ రైల్వే గ్రూప్–డి నుంచి సివిల్ సర్వీసెస్ వరకు పోటీ పరీక్షల్లో ఇంగ్లిష్ సబ్జెక్ట్ ప్రాముఖ్యతను వివరించారు.

ఈ సందర్భంగా విద్యార్థులకు ఐసెట్, బ్యాంకింగ్ పరీక్షల కోసం ఉపయోగపడే కెరీర్ క్లాస్ యాప్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు.

కార్యక్రమంలో ఉప ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సుబ్రమణ్యం, డాక్టర్ వి. నాగరాజు, డాక్టర్ యాదగిరి రెడ్డి, డాక్టర్ వెంకటేశ్వర్లు, నవీన్ పోలుగం తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఆసక్తిగా చర్చించారు.

Sthanikam

డిగ్రీ తర్వాత కెరీర్‌పై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News