Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:38 AM

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

15-04-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

మొదటి దశ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్లు ఈనెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతాల కళాశాలలను ఎంచుకోవడం కంటే, స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అన్ని అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సమృద్ధిగా ఉన్న గ్రంథాలయం, విస్తృత క్రీడామైదానం వంటి సౌకర్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి వంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా అడ్మిషన్ పొందాలని ప్రధానాచార్యులు పిలుపునిచ్చారు

Sthanikam

డిగ్రీ అడ్మిషన్లకు దోస్త్ దరఖాస్తులు ప్రారంభం. ప్రిన్సిపాల్ రాహత్ ఖానం

Article Image

డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ ఆన్‌లైన్ అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదలైందని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రామన్నపేట ప్రధానాచార్యులు ఆచార్య రాహత్ ఖానం తెలిపారు.

మొదటి దశ రిజిస్ట్రేషన్ ఈనెల 15 నుంచి మే 7 వరకు కొనసాగుతుందని, వెబ్ ఆప్షన్లు ఈనెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. విద్యార్థులు దూర ప్రాంతాల కళాశాలలను ఎంచుకోవడం కంటే, స్థానికంగా ఉన్న డిగ్రీ కళాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

అన్ని అర్హతలు కలిగిన అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విశాలమైన తరగతి గదులు, ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, సమృద్ధిగా ఉన్న గ్రంథాలయం, విస్తృత క్రీడామైదానం వంటి సౌకర్యాలు కళాశాలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అలాగే ఎన్ఎస్ఎస్, ఎన్‌సిసి వంటి కార్యక్రమాలు విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి దోహదపడతాయని పేర్కొన్నారు.

అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పకుండా అడ్మిషన్ పొందాలని ప్రధానాచార్యులు పిలుపునిచ్చారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News