Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:38 AM

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి జూన్ నాటికి సాగు నీరు అందివ్వాలి

06-04-2026 68 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకొని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగిన రైతు సంఘం మండల మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రబి సీజన్ వరి కోతలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నదని ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రాశులు పోసి నిండిపోతున్నవని ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోవడంతో గతంలో మాదిరిగా అకాల వర్షాల మూలంగా ధాన్యం తడిసి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నారు.వెంటనే కొనుగోలు ప్రారంభిస్తే ఎలాంటి ఇబ్బంది జరగకుండా త్వరగా కొనుగోలుచేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని దీనికోసం అధికార యంత్రాంగం చొరవ చూపాలని అన్నారు. నెలల తరబడి ధాన్యం రాశులు మార్కెట్ కేంద్రాల్లో నిలువ ఉండడంతో రైతులకు పట్టాల కిరాయి ఎక్కువై ధాన్యం తడిసి రంగు మారుతుండడంతో రైస్ మిల్లు యజమాన్యం కోతలు విధించి రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉందని ఆర్థికంగా రైతు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. కొనుగోలు చేసిన 48 గంటల్లో రైతుల ఖాతాలో డబ్బులు జమ చేయాలని గన్నీ బ్యాగుల కొరతను నివారించాలని మార్కెట్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని, లారీల కొరత లేకుండా చూడాలని అన్నారు. ధర్మారెడ్డిపల్లి కాలువ పనులు త్వరితగతిన పూర్తి చేసి జూన్ నెల నాటికల్లా రామన్నపేట ప్రాంత రైతులకు నీరు అందివ్వాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. అనంతరం రైతు సంఘం మండల నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. మండల అధ్యక్షుడిగా బోయిని ఆనంద్, మండల కార్యదర్శిగా గన్నేబోయిన విజయభాస్కర్, ఉపాధ్యక్షులుగా కందుల మల్లారెడ్డి,తాళ్లపల్లి జితేందర్ మండల కమిటి సభ్యులుగా కొమ్ము అంజమ్మ,కరకంటి మల్లయ్య, బోల్ల వెంకన్న,దేవరపల్లి బిక్షం రెడ్డి,దాడి మల్లారెడ్డి, సిల్వర్ రాజు,తాడూరి కిష్టయ్య, కాకులారపు కల్పన, గంగాదేవి అంజయ్య, బండ జగన్మోహన్ రెడ్డి తదితరులను ఎన్నుకున్నారు.

Sthanikam

ధర్మారెడ్డిపల్లి కాల్వ పనులు పూర్తి చేసి జూన్ నాటికి సాగు నీరు అందివ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News