Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:48 PM

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి

09-04-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నలగొండ, మండల కేంద్రంలోని అనంతారం గ్రామంలో ఎన్‌డీసీఎంఎస్ (NDCMS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ అధికారి (ఏఈఓ) మురళి గురువారం పరిశీలించారు.

కేంద్రంలో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను సమీక్షించిన ఆయన, రైతులు పండించిన ధాన్యాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సకాలంలో కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. తూకం, నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటిస్తూ, రైతులకు పారదర్శకంగా మద్దతు ధర అందించాలని పేర్కొన్నారు.

మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి, చెల్లింపులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని త్రాగునీరు, టార్పాలిన్ కవర్లు, గోనె సంచులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎన్‌డీసీఎంఎస్ నిర్వాహకులు సుంకరబోయిన శంకర్, తిరుపల నాగరాజు, కడారి శంకర్, తిరుపాల పరమేష్, ఆవుల రాజు, స్థానిక అధికారులు, సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోలు కేంద్రం పరిశీలించిన ఏఈఓ మురళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News