రామన్నపేట మండలంలోని కుడుపాముల గ్రామంలో మహిళా సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ధాన్యం కొనుగోలు కార్యక్రమంలో తూకం సరిగా వేయాలని సర్పంచ్ గొలుసుల సత్తయ్య సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హమాలీలు, లారీలు, రైస్ మిల్లుల వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతులకు చెల్లింపులు ఆలస్యం కాకుండా పత్రాల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు.
రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు కన్నెబోయిన శంకర్, రైతులు యాస మల్లారెడ్డి, నల్ల శ్రీనివాస్ రెడ్డి, సంఘ బంధం సభ్యులు, హమాలీలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి