Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:29 AM

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

21-04-2026 38 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: రైతులు పండించిన ధాన్యం కుప్పలను తేమ శాతం పరిశీలించి వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ… ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వరి కుప్పలను సమగ్రంగా తనిఖీ చేసి, మాయిశ్చర్ శాతం సరిగా వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిరోజూ ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి స్ప్రెడ్‌షీట్ ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం పరిశీలనలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల్లో తనిఖీలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం అసలు వద్దు. తేమ శాతం పరిశీలించి వెంటనే కొనుగోలు చేయాలి.అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు

Article Image

భువనగిరి: రైతులు పండించిన ధాన్యం కుప్పలను తేమ శాతం పరిశీలించి వెంటనే కాంటా వేసి కొనుగోలు చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, పౌరసరఫరాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డి కూడా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ… ఏఈఓలు ప్రతి రోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి తేమ శాతం, నాణ్యతను పరిశీలించాలని సూచించారు. వరి కుప్పలను సమగ్రంగా తనిఖీ చేసి, మాయిశ్చర్ శాతం సరిగా వచ్చిన తర్వాతే కొనుగోళ్లు చేపట్టాలన్నారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జిల్లా వ్యవసాయ అధికారి ప్రతిరోజూ ఉదయం నుంచే ఫీల్డ్‌లో ఉండి స్ప్రెడ్‌షీట్ ఆధారంగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ధాన్యం పరిశీలనలో ఎటువంటి అలసత్వం ఉండకూడదని, ఉదయం 6 గంటల నుంచే కేంద్రాల్లో తనిఖీలు ప్రారంభించాలని స్పష్టం చేశారు. నాణ్యత కలిగిన ధాన్యాన్ని మాత్రమే మిల్లులకు తరలించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి రోజారాణి, జిల్లా సరఫరాల మేనేజర్ హరికృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News