Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:25 AM

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

24-04-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-బాధ్యులపై చర్యలు తీసుకోవాలి .. కర్రె ప్రవీణ్

యాదగిరిగుట్ట పట్టణంలోని సింహద్వారం సమీపంలో దేవస్థానం భూమిలో అక్రమంగా రేకుల షెడ్ నిర్మించారని ఆరోపిస్తూ పట్టణ బీజేపీ అధ్యక్షుడు కర్రె ప్రవీణ్ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం నిరసన చేపట్టారు. షెడ్ వద్దే ఆందోళన నిర్వహించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కర్రే ప్రవీణ్ మాట్లాడుతూ... దేవస్థానం ఆస్తులపై కబ్జాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం లేకుండా,సంబంధిత అధికారుల అనుమతి లేకుండా షెడ్ ఎలా నిర్మించారో వివరణ ఇవ్వాలని ప్రశ్నించారు.సాధారణ ప్రజలు ఇలాంటి పనులు చేస్తే వెంటనే కేసులు నమోదు చేసే పోలీసులు, ఈ ఘటనలో ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.తమ నిరసన తర్వాత అధికారులు తొందరపాటుగా షెడ్ తొలగించారని,అయితే బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. చైర్మన్ భర్తతో పాటు సంబంధితులపై,అలాగే షెడ్ నిర్మాణానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు రచ్చ శ్రీనివాస్,భువనగిరి శ్యామ్,గుంటుపల్లి సత్యం,ఆకుల చంద్రమౌళి,నరేష్,రంగా సత్యం,నల్ల వెంకట్ రెడ్డి,బోడ సురేష్,వంశీ,లక్ష్మయ్య,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

దేవస్థానం భూమిలో అక్రమ షెడ్ నిర్మాణం చర్యలకు బీజేపీ డిమాండ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News