Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

22-04-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

జూబ్లీ హిల్స్‌లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.

దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Sthanikam

డీసీపీకి పాచిపోయిన కీమా..! నగరంలో ఆహార భద్రతపై ఆందోళన

Article Image

హైదరాబాద్: నగరంలో ఆహార భద్రత ప్రమాణాలు దిగజారుతున్నాయనే అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఓ డీసీపీ స్థాయి అధికారికే పాచిపోయిన ఆహారం వడ్డించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది.

జూబ్లీ హిల్స్‌లోని ‘తెలుగు మీడియం’ రెస్టారెంట్ నుంచి డీసీపీ ముత్యం రెడ్డి ఆన్లైన్‌లో ఆర్డర్ చేసిన మటన్ కీమా నుంచి దుర్వాసన రావడంతో ఘటన బయటపడింది. దీనిపై సమాచారం అందుకున్న ఆహార భద్రత అధికారులు వెంటనే తనిఖీలు నిర్వహించారు.

దాడుల్లో వంటగదిలో నిల్వ ఉంచిన కుళ్లిపోయిన మాంసం బయటపడినట్లు తెలిసింది. కేవలం గత నెలలోనే నగరవ్యాప్తంగా 129 టన్నుల పాడైన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నప్పటికీ, రెస్టారెంట్ల నిర్వహణలో మార్పు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మాంసంతో పాటు పాలు, మసాలాలు, నూనెలలో కల్తీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News