Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:18 AM

డీ లిమిటేషన్ ప్రజాస్వామ్యానికి ముప్పు – జె.వి. చలపతిరావు

27-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్,

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫాసిస్ట్ విధానాలను అమలు చేస్తోందని, అందులో భాగంగానే ఎస్‌ఐఆర్–డీ లిమిటేషన్ విధానాన్ని తీసుకువచ్చిందని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జె.వి. చలపతిరావు విమర్శించారు.

నకిరేకల్ పట్టణంలోని కామ్రేడ్ యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఈ విధానాలను అమలు చేస్తున్నదన్నారు. డీ లిమిటేషన్ ద్వారా ఉత్తర భారత రాష్ట్రాల్లో పార్లమెంట్ స్థానాలను పెంచి, దక్షిణాది రాష్ట్రాలపై రాజకీయ, ఆర్థిక అసమానతలు పెంచే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.

ఓట్ల తొలగింపు, ప్రజా ప్రయోజన చట్టాల రద్దు వంటి చర్యలతో ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. డీ లిమిటేషన్ భవిష్యత్తులో ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారుతుందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ కార్యదర్శి సాగర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పి. మహేష్, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర నాయకురాలు అరుణక్క, ఏఐకేవైఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి, జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జి రవి, పీడీఎస్‌యూ నాయకుడు కంచనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

డీ లిమిటేషన్ ప్రజాస్వామ్యానికి ముప్పు – జె.వి. చలపతిరావు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News