Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:42 AM

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులకు హైకోర్టు కీలక గైడ్‌లైన్స్ – వాహన సీజ్‌పై స్పష్టత

11-04-2026 174 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో కేవలం మద్యం సేవించారనే కారణంతో వాహనాలను సీజ్ చేయడం చట్టవిరుద్ధమని తెలంగాణ హైకోర్టు ఇటీవల మరోసారి స్పష్టం చేసింది. జస్టిస్ ఈ.వి. వేణుగోపాల్ ధర్మాసనం ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

మద్యం తాగి వాహనం నడపడం తీవ్రమైన నేరమే అయినప్పటికీ, వాహన యజమానులను అనవసరంగా ఇబ్బందులకు గురిచేయరాదని కోర్టు అభిప్రాయపడింది.

చట్టం ప్రకారం మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తిపై కేసు నమోదు చేయవచ్చని, కానీ వాహనాన్ని సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రత్యామ్నాయ చర్యలపై కూడా కోర్టు సూచనలు చేసింది. వాహనంలో ఉన్న ఇతర వ్యక్తులు మద్యం సేవించకుండా, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉంటే వాహనాన్ని వారికి అప్పగించాలని పేర్కొంది. డ్రైవర్ ఒక్కడే ఉన్న సందర్భంలో బంధువులు లేదా స్నేహితులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని అప్పగించాలన్నారు.

ఎవరూ అందుబాటులో లేని పరిస్థితుల్లో మాత్రమే వాహనాన్ని తాత్కాలికంగా పోలీసు కస్టడీలో ఉంచవచ్చని, అవసరమైన పత్రాలు (RC, లైసెన్స్) సమర్పించిన వెంటనే వాహనాన్ని విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. అవసరమైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను స్వాధీనం చేసుకోవచ్చని కూడా పేర్కొంది.

Sthanikam

డ్రంక్ అండ్ డ్రైవ్‌పై పోలీసులకు హైకోర్టు కీలక గైడ్‌లైన్స్ – వాహన సీజ్‌పై స్పష్టత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News