Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:38 PM

చోలే మర్రి సర్పంచ్ జనార్ధన్ గౌడ్ సేవలకు ఘన సన్మానం – ఐదుేళ్ల అభివృద్ధి ప్రస్థానం

25-04-2026 154 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి /రొద్దం :

2021 నుంచి 2026 వరకు చోలే మర్రి గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు చేపట్టిన జనార్ధన్ గౌడ్, గ్రామ అభివృద్ధి మరియు ప్రజాసేవలో విశేష కృషి చేసి ఆదర్శ నాయకుడిగా నిలిచారు. పదవిలోకి వచ్చిన రోజు నుంచే గ్రామాభివృద్ధి లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపట్టి ప్రజల మన్ననలు పొందారు.

గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ నిర్మాణం, సీసీ రోడ్ల ఏర్పాటు, చోలే మర్రి నుంచి బొమ్మరెడ్డిపల్లి వరకు మట్టి రహదారి అభివృద్ధి వంటి పనులు పూర్తి చేశారు. చెరువులు, స్మశానవాటికలో పరిశుభ్రత పనులు చేపట్టి గ్రామానికి కొత్త రూపు తీసుకొచ్చారు. ఎండాకాలంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుని ఐదేళ్ల పాటు ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకున్నారు.

గ్రామంలో సమస్యలు వచ్చినప్పటికీ ఎటువంటి ఎఫ్‌ఐఆర్‌లకు దారి తీసకుండా పరస్పర చర్చల ద్వారా పరిష్కారం చూపిస్తూ శాంతి, ఐక్యతను కాపాడారు. గణేష్, పీర్ల పండుగలను గ్రామస్తుల సహకారంతో ఘనంగా నిర్వహించి సామాజిక ఐక్యతను పెంపొందించారు.

విద్య ప్రాముఖ్యతను గుర్తించి పాఠశాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూ విద్యార్థుల్లో పోటీ భావన పెంచారు. స్కూల్‌లో కాంపౌండ్ వాల్, మైక్ సౌకర్యం, స్పోర్ట్స్ కిట్లు, ఆటపోటీల నిర్వహణ వంటి అనేక కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచారు.

ఈ సేవలను గుర్తించి హైస్కూల్ హెడ్‌మాస్టర్ మాధవి లత మరియు సిబ్బంది ఆధ్వర్యంలో జనార్ధన్ గౌడ్‌కు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన జీవితకాలం పాటు విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు.

గ్రామాభివృద్ధిలో తనకు తోడ్పడిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామ ప్రజలు కూడా జనార్ధన్ గౌడ్ సేవలను ప్రశంసిస్తూ, ఆయనకు మరిన్ని ఉన్నత పదవులు దక్కాలని ఆకాంక్షించారు.

Sthanikam

చోలే మర్రి సర్పంచ్ జనార్ధన్ గౌడ్ సేవలకు ఘన సన్మానం – ఐదుేళ్ల అభివృద్ధి ప్రస్థానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News