Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్దకాపర్తిలో రైతులకు CRIDA శాస్త్రవేత్తల అవగాహన 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 03:17 PM

చందేపల్లిలో మహనీయుల విగ్రహావిష్కరణ మహోత్సవం

చందేపల్లిలో మహనీయుల విగ్రహావిష్కరణ మహోత్సవం

చందేపల్లిలో మహనీయుల విగ్రహావిష్కరణ మహోత్సవం
April 14, 2026 07:57 PM 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

- అట్టహాసంగా అంబేద్కర్,బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాల ఆవిష్కరణ

- విగ్రహ ఆవిష్కరణకు హాజరైన జే.బి రాజు,గొంగిడి సునీత,గోవింద్ నరేష్

మోటకొండూరు మండల పరిధిలోని చందేపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్,దేశ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ ల విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు జే.బి రాజు,మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ లు ముఖ్య అతిథులుగా హాజరై, మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలతో ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ.. దేశంలో అణగారిన వర్గాలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించిన మహనీయుడు అంబేద్కర్ అని, అలాగే అట్టడుగు వర్గాల అభ్యున్నతికి, దేశాభివృద్ధికి బాబు జగజ్జీవన్ రామ్ చేసిన సేవలు చరిత్రలో చెరిగిపోనిది అని కొనియాడారు. వారి విగ్రహాలను ఒకే చోట ప్రతిష్టించడం గ్రామానికే గర్వకారణమని హర్షం వ్యక్తం చేశారు. కేవలం విగ్రహాల ఏర్పాటుతోనే సరిపెట్టకుండా, వారు చూపిన బాటలో నడుస్తూ సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. విగ్రహాల ఏర్పాటుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన పట్నం రాయగిరి కుటుంబ సభ్యుల ఉదారతను అతిథులు కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహ దాతలు పట్నం రాయగిరి సంజీవ,పట్నం రాయగిరి రితీష్,రఘు రాజు, హసిత్,అంబేద్కర్ విగ్రహ దాతలు పట్నం రాయగిరి రామచందర్, అంజయ్య,వీరస్వామి, యాదగిరి, నగేష్, శంకర్ సొంత నిధులతో విగ్రహాలను ఏర్పాటు చేసి గ్రామంలో మహనీయుల స్మృతిని చాటినందుకు గ్రామస్తులు దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ కాంట్రాక్టర్ సుదగాని మల్లేష్ గౌడ్,సుప్రజ హాస్పిటల్ ఎండి శిగ విజయ్ కుమార్, దూదిపాల రవీందర్ రెడ్డి, సుదగాని జయరాములు, అరవింద్ రెడ్డి, నర్సిరెడ్డి, ఎంఎస్ఎఫ్ జాతీయ నాయకులు సోమశేఖర్,నిమ్స్ ఆసుపత్రి సుశీల కుమారి,రాయగిరి జ్ఞానేశ్వర్,మంద శంకర్, జిల్లా నాయకులు నల్ల చంద్ర స్వామి,జిల్లా కార్యదర్శి గోసంగి పరమేష్,జిల్లా నాయకులు బూడిద జానీ,మండల అధ్యక్షుడు ఆడేపు శ్రీనివాస్,కార్యక్రమ నిర్వహణ కమిటీ అధ్యక్షులు బోట్ల నర్సింగరావు,కడిగళ్ళ నరసింహులు,గోసంగి పరమేష్,బోట్ల చిన్న రాములు,వెల్మజాల యాదయ్య, మందుల కిష్టయ్య బోట్ల నగేష్, నిమ్మల నవీన్,కమిటీ సభ్యులు,అన్ని కుల సంఘాల నాయకులు, మహిళలు,యువకులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ వేడుకలో ఎపురి యాకన్న,సురేష్ కళా బృందం వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంబేద్కర్,బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రను,వారు చేసిన పోరాటాలను తమ పాటల ద్వారా కళ్లకు కట్టినట్లు వివరించారు. విగ్రహాల ఆవిష్కరణ సమయంలో ప్రజలు,యువకులు "జై భీమ్" నినాదాలతో గ్రామాన్ని హోరెత్తించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News