Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:08 AM

చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్

26-04-2026 196 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి అండగా ఉన్న ఏలూరి రవి మృతి చెందడంతో ఆయన కుటుంబం ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయింది. భార్య ఏలూరి మానస, ఇద్దరు చిన్నారి కుమార్తెల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిన వేళ మానవత్వం చూపిన దాత ముందుకొచ్చారు.

గ్రామ సర్పంచ్ నర్సింహ గట్టు ద్వారా విషయం తెలుసుకున్న తుమ్మల ప్రమోద్ వెంటనే స్పందించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చిన్నారుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారి విద్య, జీవన అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు.

అంతేకాక చిన్న కూతురు పేరుపై సుకన్య సమృద్ధి పథకం కింద రూ.54 వేల డిపాజిట్ చేసి, భవిష్యత్తులో సుమారు రూ.2 లక్షలు అందేలా చర్యలు తీసుకున్నారు. బాధలో ఉన్న తల్లికి ధైర్యం చెప్పి, ఎలాంటి కష్టసమయంలోనైనా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన ఈ సహాయాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, చిన్నారుల భవిష్యత్తుకు భరోసా కల్పించిన తుమ్మల ప్రమోద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

చిన్నారుల భవిష్యత్తుకు అండగా తుమ్మల ప్రమోద్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News