Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:06 AM

చిన్న కొండూరులో వైభవంగా నూతన ఆలయాల శంకుస్థాపన

22-04-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

రామాలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ నిర్మాణానికి భూమిపూజ

చౌటుప్పల్ మండల పరిధిలోని చిన్న కొండూరు గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. గ్రామ శివారులోని ప్రసిద్ధ శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో బుధవారం నూతనంగా నిర్మించనున్న శ్రీ రామాలయం, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారల ఆలయాలకు అత్యంత వైభవంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.ఆలయ కమిటీ అధ్యక్షులు ఎరుకల రాందాస్ గౌడ్ - సంధ్య దంపతులు శంకుస్థాపన మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కొండూరు నరసింహ శర్మ వేద మంత్రోచ్ఛారణల మధ్య, శాస్త్రోక్తంగా భూమిపూజ, శంకుస్థాపన కార్యక్రమాలను జరిపించారు.ఈ శుభకార్యంలో గ్రామ సర్పంచ్ తిగుళ్ల చంద్రయ్య, ఉప సర్పంచ్ గడ్డం సత్తయ్య, పాల్గొని ఆలయ అభివృద్ధి పనులను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు రాందాస్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామస్తుల సహకారంతో భవిష్యత్తులో ఈ ఆలయ ప్రాంగణాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.​ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు,భక్తులు పాల్గొని స్వామివార్ల తీర్థప్రసాదాలను స్వీకరించారు.

Sthanikam

చిన్న కొండూరులో వైభవంగా నూతన ఆలయాల శంకుస్థాపన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News