Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్

21-04-2026 34 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చౌటుప్పల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్యాలపు నరేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకుని ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శిబిరంలో మొత్తం 67 మంది చేనేత కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. వీరిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలమోహన్ రెడ్డి, ఏడీఓ, తంగేడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కాటంరాజు, పల్లె దవాఖాన సిబ్బంది, ఎంఎల్హెచ్‌పీలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చేనేత కార్మికులకు వైద్య శిబిరం 67 మందికి చికిత్స… ఇద్దరిని జిల్లా ఆసుపత్రికి రిఫర్

Article Image

చౌటుప్పల్, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చౌటుప్పల్ మండలం కుంట్లగూడెం గ్రామంలోని చేనేత సహకార సంఘంలో మంగళవారం ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ అన్యాలపు నరేష్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు అందిస్తున్న ఆరోగ్య సేవలను వినియోగించుకుని ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. శిబిరంలో మొత్తం 67 మంది చేనేత కార్మికులు వైద్య పరీక్షలు చేయించుకుని చికిత్స పొందారు. వీరిలో ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం భువనగిరి ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించారు.

అసిస్టెంట్ డైరెక్టర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నెల 22, 23 తేదీలలో కొయ్యలగూడెం గ్రామ చేనేత సహకార సంఘంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బాలమోహన్ రెడ్డి, ఏడీఓ, తంగేడుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి కాటంరాజు, పల్లె దవాఖాన సిబ్బంది, ఎంఎల్హెచ్‌పీలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News