Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 03:36 AM

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు
15-04-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలోని చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 16 నుంచి మే 13 వరకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా సుమారు 10,323 మంది చేనేత కార్మికులు ఉన్నట్లు పేర్కొంటూ, ఆయా మండలాలు, గ్రామాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ శిబిరాల్లో జనరల్ ఫిజీషియన్, కంటి వైద్యుడు, ఎముకల నిపుణులు పాల్గొని ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేస్తారని చెప్పారు.

రక్తపోటు, షుగర్, కంటి, ఎముకల సమస్యలతో పాటు దీర్ఘకాలిక వ్యాధుల నిర్ధారణ పరీక్షలు చేపడతారని, అవసరమైతే రోగులను రిఫరల్ ఆసుపత్రులకు తరలిస్తామని తెలిపారు.

ప్రతి రోజు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరాలు కొనసాగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం వివిధ మండలాలు, గ్రామాల్లో ఈ శిబిరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

శిబిరాల ముఖ్య తేదీలు:

ఏప్రిల్ 16: ఆలేరు

ఏప్రిల్ 17: ఆత్మకూరు

ఏప్రిల్ 18: భువనగిరి

ఏప్రిల్ 20–23: చౌటుప్పల్ పరిసరాలు

ఏప్రిల్ 24: మోటకొండూరు

ఏప్రిల్ 25: మోత్కూర్

ఏప్రిల్ 27–మే 2: పోచంపల్లి

మే 4: రాజాపేట

మే 5, 6: రామన్నపేట

మే 7: వలిగొండ

మే 8: యాదగిరిగుట్ట

మే 11: గుండాల

మే 12: నారాయణపూర్

మే 13: పుట్టపాక

జిల్లాలోని చేనేత కార్మికులు, వారి కుటుంబ సభ్యులు ఈ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Sthanikam

చేనేత కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News