Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:01 AM

చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం

చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం

చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం
23-04-2026 207 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చిత్రపటానికి పాలాభిషేకం

చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని నేషనల్ హైవే-65 పై బస్ స్టేషన్ సమీపంలో అండర్ పాస్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. గురువారం పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ నాయకులు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డిల చిత్రపటాలకు నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా హైవే అధికారులు శివశంకర్, సి.ఎస్.రావులకు పార్టీ తరపున అభినందనలు తెలిపారు. గతంలో అండర్ పాస్ నిర్మాణం కోసం బీజేపీ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేసి, కేంద్ర మంత్రికి వినతిపత్రాలు అందించిన ఫలితంగానే నేడు ఈ మంజూరు సాధ్యమైందని నాయకులు గుర్తు చేశారు. ప్రాజెక్టు ఆలస్యమవుతుందని, ఇందులో తలదూర్చవద్దని గతంలో హేళన చేసిన కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులు.. ఇప్పుడు పనులు మంజూరయ్యాక క్రెడిట్ కోసం ప్రయత్నించడం సిగ్గుచేటని వారు విమర్శించారు.

నత్తనడకన రోడ్డు పనులు.. బైఠాయించిన బీజేపీ శ్రేణులు:

వలిగొండ - నాగారం - చౌటుప్పల్ రోడ్డు పనులు గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతూ, ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శంకుస్థాపన చేసిన శిలాఫలకం నుండి రోడ్డుపై బైఠాయించి, నల్ల జెండాతో నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి వెంటనే స్పందించి ఈ రోడ్డు పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ప్రధాని నరేంద్ర మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీరును నిరసిస్తూ పట్టణ కేంద్రంలో ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. దేశ ప్రధానిని ఉగ్రవాదిగా వర్ణించడం ఖర్గే అనాలోచిత ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడుతున్న ఆయనపై నాన్-బెయిలబుల్ కేసు నమోదు చేసి, వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దూడల బిక్షం గౌడ్, జిల్లా నాయకులు రమణ గోని శంకర్, శాగ చంద్రశేఖర్ రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు కడారి కల్పన యాదవ్, కంచర్ల గోవర్ధన్ రెడ్డి, ఆలే చిరంజీవి, కైరం కొండ అశోక్, దిండు భాస్కర్, కౌన్సిలర్ బుడ్డ సురేష్, గుజ్జుల సురేందర్ రెడ్డి, నందగిరి వెంకటేశం గౌడ్, ఊడుగు వెంకటేశం గౌడ్, పోలోజు శ్రీధర్ బాబు,కంది లక్ష్మారెడ్డి, ఉబ్బు బిక్షపతి, కడారి ఐలయ్య, పబ్బతి శేఖర్, గంట్ల బుచ్చిరెడ్డి, గుర్రం రవీందర్, తేలుకుంట్ల శ్రీధర్, రాధారపు సత్తయ్య, పోలపల్లి ముత్తయ్య, గోషిక నీరజ, హల్మాస్పేట గౌతమ్, గోషిక పురుషోత్తం, కంచర్ల వెంకటరెడ్డి, కాసోజు గోపి, గుండెబోయిన వేణు, వంగాల రమాకాంత్, కానుగు కొండల్, రాజపేట అశోక్, ఎల్లంకి పాండు, వరగంటి భాను, కానుగు శేఖర్, బత్తుల రాజశేఖర్, గుండెపల్లి వెంకటరెడ్డి, కాసోజు కనకాచారి, అంతటి నరేష్, పందుల శరత్, కొయ్యడ స్వామి, పోలోజు భాస్కరాచారి, గుండెబోయిన లింగస్వామి, బి.గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్ అండర్ పాస్ మంజూరు హర్షణీయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News