Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి: కౌన్సిలర్ చింతల ఉమామహేశ్వరి సాయిలు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:37 PM

చప్తాకే గ్రామ అంగన్వాడీలో రంగుల మేళాగా యానివల్ డే

04-04-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం చప్తాకే గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో సంవత్సరం ముగింపు సందర్భంగా యానివల్ డే కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్ జగదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెత్రి సంగమ్మ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదేవి మాట్లాడుతూ మూడు సంవత్సరాల వయస్సు నుంచే పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించడం ద్వారా వారికి క్రమశిక్షణ, మంచి అలవాట్లు, ప్రాథమిక విద్యతో పాటు సామాజిక విలువలు కూడా అలవడతాయని తెలిపారు. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా పిల్లల ప్రతిభను వెలికి తీసి ప్రోత్సహించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో చిన్నారులు జంతువుల వేషధారణలో పాల్గొని అందరినీ ఆకట్టుకోగా, 4+ మరియు 5+ వయస్సు గల పిల్లలకు అసెస్‌మెంట్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బస్వారాజ్, హై స్కూల్ మరియు ప్రైమరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు, సీడీపీఓ సుజాత, సూపర్వైజర్ మంజుల తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

చప్తాకే గ్రామ అంగన్వాడీలో రంగుల మేళాగా యానివల్ డే

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News