Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కోదాడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:53 PM

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు

21-04-2026 191 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​ట్రినిటీ హైస్కూల్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

విద్యార్థులు చదువులో రాణిస్తేనే సమాజంలో గౌరవం, మంచి భవిష్యత్తు లభిస్తాయని మండల విద్యాధికారి గురువారావు అన్నారు. మంగళవారం చౌటుప్పల్ పురపాలక కేంద్రంలోని వీవీఆర్ ఫంక్షన్ హాల్‌లో ట్రినిటీ హైస్కూల్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'గ్రాడ్యుయేషన్ డే' వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్, ఎంఈఓ గురువారావు హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లను అందజేశారు.​ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. విద్యార్థుల మనోవికాసానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు చదువును భారంగా భావించకుండా, ఆడుతూ పాడుతూ ఇష్టపడి చదవాలని సూచించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తూ, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న ట్రినిటీ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు.​గతంలో కేవలం విశ్వవిద్యాలయాలకే పరిమితమైన గ్రాడ్యుయేషన్ వేడుకలను పాఠశాల స్థాయిలో నిర్వహించడం వల్ల చిన్న పిల్లల్లో చదువుపై ఆసక్తి, బాధ్యత పెరుగుతాయని ఎంఈఓ గురువారావు తెలిపారు. ఇదే క్రమంలో తల్లిదండ్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. పూర్వం చందమామను చూపిస్తూ అన్నం తినిపించేవారని, ఇప్పుడు సెల్ ఫోన్లు చూపిస్తూ తినిపిస్తున్నారని..ఈ ధోరణి మారాలని కోరారు.స్కూల్ నుండి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఫోన్లకు దూరంగా ఉండి, రోజుకు కనీసం ఒక గంట పిల్లలతో గడిపితే వారిలో సానుకూల మార్పు వస్తుందని చెప్పారు.ఈ వేడుకలో గాంధీ గ్లోబల్ మండల కన్వీనర్ వెన్ రెడ్డి సంధ్యా రాజు, ఏడవ వార్డు కౌన్సిలర్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, పాఠశాల చైర్మన్ కే.వీ.బీ. కృష్ణారావు, ప్రిన్సిపాల్ కమ్ డైరెక్టర్ డాక్టర్ ఉజ్జని మంజుల, చింతల కరుణ, పబ్బు వంశీ, బడుగు శ్రీరాములు, ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Sthanikam

చదువుతోనే ఉజ్వల భవిష్యత్తు: ఎంఈఓ గురువారావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News