Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 01:34 AM

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

07-04-2026 114 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల కోసం ప్రముఖ ఫార్మా సంస్థ MSN ల్యాబ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక నియామక కార్యక్రమం నిర్వహించారు. ‘సంపాదిస్తూ చదువుకోండి’ అనే కార్యక్రమం ద్వారా విద్యార్థులకు ఉద్యోగంతో పాటు ఉచిత ఉన్నత విద్య అవకాశాన్ని కల్పిస్తున్నారు.

సంస్థ హెచ్‌ఆర్ సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఎంపికైన అభ్యర్థులను API విభాగంలో టెక్నికల్ ట్రైనీలుగా నియమించనున్నట్లు తెలిపారు.

ఎంపికైన వారికి నెలకు రూ.15,000 వేతనంతో పాటు వార్షికంగా పనితీరు ఆధారంగా వేతన పెంపు ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఉద్యోగంతో పాటు ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ద్వారా ఉచితంగా B.Sc (కెమిస్ట్రీ) చదివే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.

2024, 2025, 2026 సంవత్సరాల్లో ఇంటర్మీడియట్ (MPC/BiPC/MLT) పూర్తి చేసి కనీసం 50 శాతం మార్కులు సాధించిన 17 నుంచి 21 ఏళ్ల లోపు అబ్బాయిలు అర్హులని తెలిపారు. ఉద్యోగి రాష్ట్ర బీమా (ESI) ద్వారా వైద్య సదుపాయాలు కూడా లభిస్తాయని చెప్పారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సి. జగదీష్, అధ్యాపకులు వి. నరసింహారావు, కిరణ్, అశోక్ రెడ్డి, మాలే వెంకట్ రెడ్డి, రాజేశ్వరి, అశోక్ కుమార్, ఉపేందర్ రావు, ఉమా రాణి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చదువుతో పాటు ఉద్యోగం.. విద్యార్థులకు స్వర్ణావకాశం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News