Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:25 AM

బోనగిరిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

21-04-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: బోనగిరి పట్టణంలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మున్సిపల్ మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

మార్చి 10 నుంచి సీపీఎం బృందం పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను సేకరించినట్లు తెలిపారు. హుస్నాబాద్ ఇందిరమ్మ కాలనీలో ఐదేళ్ల క్రితం నిర్మించిన మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్‌ను ఇప్పటివరకు వినియోగంలోకి తేవలేదని, ప్రతి వార్డులో పైపుల ద్వారా తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.

ఫుట్‌పాత్ వ్యాపారుల కోసం నిర్మించిన సముదాయాలు ఉపయోగంలోకి రావడం లేదని, ఇందిరమ్మ ఇళ్లకు మంజూరైన నిధులు పూర్తి స్థాయిలో విడుదల కాక నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయని చెప్పారు. పెన్షన్లు పెంపు, గృహజ్యోతి కింద ఉచిత విద్యుత్, విద్యార్థినులకు స్కూటీలు వంటి హామీలు అమలులో లేకపోవడంపై విమర్శించారు.

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం ఆలస్యం అవుతుండటం, సింగన్నగూడెంలో వాటర్ ఫిల్టర్ పనిచేయకపోవడం, ఎల్బీనగర్ ప్రాంతంలో ప్రభుత్వ భవనాలను వినియోగంలోకి తేవకపోవడం వంటి సమస్యలను ప్రస్తావించారు. 32వ వార్డులో స్టేడియం కబ్జాలకు గురవుతోందని, ప్రహరీ గోడ నిర్మించి రక్షించాలని కోరారు.

పట్టణంలో అనుమతులు లేకుండా ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నాయని, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వల్ల ఆదాయానికి నష్టం జరుగుతోందని ఆరోపించారు. అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజ్ సమస్యలను పరిష్కరించాలని కోరారు.

డిమాండ్లు నెరవేర్చకపోతే మున్సిపల్ కార్యాలయం ముందు భారీ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో గంధముల మాతయ్య, బందల ఎల్లయ్య, వనం రాజు, వోల్దాస్ అంజయ్య, చింతల శివ, మన్నె రాజు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోనగిరిలో సమస్యలు వెంటనే పరిష్కరించాలి: సీపీఎం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News