Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:51 PM

బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు

09-04-2026 169 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పాలకి డబ్బు లేదు... రైతుల కష్టాలకు ఎవరూ లేరు!

రామన్నపేట మండలం, నీర్నంల గ్రామంలో పాడి రైతులు గురువారం ఆందోళనకు దిగారు. గత నాలుగు నెలలుగా పాల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో పశువుల దాణా ఖర్చులు గణనీయంగా పెరిగినప్పటికీ, బిల్లులు అందక ఇబ్బందులు రెట్టింపయ్యాయని తెలిపారు.

నార్మల్ డైరీ (మదర్ డైరీ )యాజమాన్యం మాత్రం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. “రైతులు ఎలా ఉన్నా పట్టించుకోకుండా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది” అంటూ మండిపడ్డారు. వెంటనే పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేశారు.

రైతులను ఇబ్బందులకు గురి చేయడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు విడుదల చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ దొంతర బోయిన దాసు, శివలీల, డైరెక్టర్లు నోముల పద్మ, రామలింగం, ఆవుల సైదమ్మ, భగవంతం, రైతులు ఏబీసీ కిష్టయ్య, కన్నెబోయిన నరసింహ, కొత్త పరుశురాం, మనకుంట్ల లింగయ్య, రేవణాల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బిల్లులు లేవు – బతుకులు కష్టాలు... రోడ్డెక్కిన పాడి రైతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News