Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:27 AM

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

21-04-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి,హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్,బస్వాపూర్, చందుపట్ల,వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ,పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా పినిలుస్తోందని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో అధిక స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొంటూ,ఇది రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా,వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ప్రాంగణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భువనగిరిలో వరి కొనుగోలు కేంద్రాల ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Article Image

భువనగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంగళవారం భువనగిరి మండల పరిధిలోని వడపర్తి,హన్మాపురం గ్రామాలతో పాటు హుస్సేనాబాద్,బస్వాపూర్, చందుపట్ల,వీరవెల్లి గ్రామాల్లో ఐకేపీ,పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా పినిలుస్తోందని తెలిపారు. పంజాబ్,హర్యానా రాష్ట్రాల కంటే తెలంగాణలో అధిక స్థాయిలో ధాన్యం ఉత్పత్తి అవుతున్నదని పేర్కొంటూ,ఇది రాష్ట్ర రైతుల కృషికి నిదర్శనమని అన్నారు. రైతులు తమ పంటను మధ్యవర్తుల వద్ద కాకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని సూచించారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా,వేగవంతంగా జరిగేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు. అనంతరం వడపర్తి గ్రామంలోని ఐకేపీ ప్రాంగణంలో వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో భువనగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్,డైరెక్టర్లు,ప్రజాప్రతినిధులు,అధికారులు,రైతులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News