Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శిథిలావస్థకు చేరిన బాలికల హాస్టల్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 07:38 PM

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన
29-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో దొంగ ఓట్లు, డబుల్ ఓట్ల సమస్య తీవ్రంగా ఉందని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ఆరోపించింది. ఈ మేరకు పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇంచార్జి కత్తుల కాన్షీరామ్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రజాస్వామ్యానికి మూలాధారం అయిన ఓటు హక్కును కొంతమంది రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు నమోదు చేసుకోవడం, వేరే ప్రాంతంలో నివసిస్తూ ఇక్కడ కూడా ఓటు కొనసాగించడం, అధికారులపై ఒత్తిడి తెచ్చి పేర్లు జాబితాలో ఉంచించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని అన్నారు.

ఇలాంటి దొంగ ఓట్ల ఆధారంగా అధికారంలోకి రావాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని కాన్షీరామ్ పేర్కొన్నారు. పేదల ఓటును దోచుకుని అధికారాన్ని నిలబెట్టుకునే రాజకీయాలకు భువనగిరి ప్రజలు మద్దతు ఇవ్వబోరని స్పష్టం చేశారు.

అందువల్ల పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను పూర్తిగా పునఃసమీక్షించి, డబుల్ ఓట్లు, దొంగ ఓట్లను వెంటనే తొలగించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం, జిల్లా ఎన్నికల అధికారులను డిమాండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం కొనసాగిస్తే భారీ స్థాయిలో ఫిర్యాదులు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

నిజాయితీ ఓటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని, దొంగ ఓట్లతో వచ్చిన అధికారాన్ని ప్రజలు తిరస్కరిస్తారని కాన్షీరామ్ అన్నారు.

Sthanikam

భువనగిరిలో దొంగ ఓట్లపై బీఎస్పీ ఆందోళన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News