Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 02:36 AM

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

08-04-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జిల్లాలో భూభారతి, ప్రభుత్వ భూములు, సాధా బైనామాలు, SIR, మీ సేవ సేవలు, ధాన్యం కొనుగోలు, ఆన్లైన్ ఇసుక సరఫరా తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

బుధవారం మినీ మీటింగ్ హాల్‌లో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి ద్వారా భూముల రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రైతులకు పారదర్శక సేవలు అందించాలని ఆదేశించారు. భూ సమస్యలు, వివాదాలను తక్షణమే పరిష్కరించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.

సాధా బైనామాల సమస్యలను చట్టపరంగా పరిశీలించి అర్హులైన వారికి న్యాయం చేయాలని తెలిపారు. SIR (Special Intensive Revision) కార్యక్రమంలో ఓటరు జాబితాలను ఖచ్చితంగా సవరించి, బూత్ స్థాయి అధికారుల పనితీరును పర్యవేక్షించాలని ఆదేశించారు.

మీ సేవ కేంద్రాల ద్వారా ప్రజలకు సేవలను వేగవంతం చేసి, దరఖాస్తులు పెండింగ్‌లో ఉండకుండా చూడాలని సూచించారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా పారదర్శకంగా సేవలు అందించాలని అన్నారు.

జిల్లాలో పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణా జరిగేలా “మన ఇసుక వాహనం” బుకింగ్ వ్యవస్థను అమలు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. దీని ద్వారా అక్రమ ఇసుక రవాణాను అరికట్టవచ్చని తెలిపారు.

అదేవిధంగా, జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సమయానికి ఏర్పాటు చేసి, కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని కలెక్టర్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జయమ్మ, ఆర్డీవోలు కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి, మండల తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

భూసంబంధిత సేవలు, ధాన్యం కొనుగోలు పై కలెక్టర్ సమీక్ష

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News