Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:33 AM

భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య. సెల్ఫీ వీడియోలో ఆరోపణలు

21-04-2026 44 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కాకినాడ, భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో విషాదం నింపింది. కాజులూరు మండలం శీల గ్రామానికి చెందిన కృష్ణా లోవరాజు (పేరు మార్పు) ఈ ఘటనకు పాల్పడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం… లోవరాజుకు సీతారామపురానికి చెందిన విజయ వనితాదేవితో సుమారు 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు నెలకొనడంతో భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

ఈ నేపథ్యంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో లోవరాజు సెల్ఫీ వీడియో రికార్డు చేసి, భార్యపై వివాహేతర సంబంధం ఆరోపణలు చేస్తూ తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. పలుమార్లు చెప్పినా మార్పు రాలేదని, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని వీడియోలో వెల్లడించాడు.

తర్వాత అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య. సెల్ఫీ వీడియోలో ఆరోపణలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News