Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
సేవలోనే స్మరణ.. మల్లేశం గౌడ్ వర్ధంతి సందర్భంగా వృద్ధులకు అన్నదానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 07, 2026 08:21 PM

అక్షర సైన్యం.. ‘కలం కవాతు’!

అక్షర సైన్యం.. ‘కలం కవాతు’!

అక్షర సైన్యం.. ‘కలం కవాతు’!
07-10-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థి ఉద్యమకారుడి సాహితీ సమరం

పుస్తకావిష్కరణలో ప్రొఫెసర్ కాసిం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం

మాజీ విద్యార్థి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, అడ్వకేట్ కట్టెల లింగస్వామి రచించిన ‘కలం కవాతు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం చౌటుప్పల్‌లోని బిఆర్‌కే కన్వెన్షన్ హాల్ (పాత నవోదయ థియేటర్)లో ఘనంగా జరిగింది. తెలంగాణ ఉద్యమకారుడు ఉప్పు కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్, ప్రముఖ రచయిత ప్రొఫెసర్ కాసిం, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, ప్రజానాట్యమండలి రాష్ట్ర అధ్యక్షుడు కే. శ్రీనివాసులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​ఈ సందర్భంగా ప్రొఫెసర్ కాసిం మాట్లాడుతూ.. సమాజంలో జరుగుతున్న అనేక అంశాల ఆధారంగా అక్షరాలను పేర్చి అద్భుతమైన పుస్తకాన్ని అందించిన కట్టెల లింగస్వామిని అభినందించారు. పోరాట నేపథ్యం ఉన్న ఈ ప్రాంతం నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి, నేడు సాహితీ రంగంలో తొలి అడుగు వేయడం అభినందనీయమన్నారు. కవి తన స్వీయ అనుభవాలతో పాటు ప్రజల జీవన విధానాన్ని ఈ పుస్తకంలో చక్కగా ఆవిష్కరించారని కొనియాడారు. ​ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. స్థానిక నిరుద్యోగం, కాలుష్యం వంటి ప్రజా సమస్యలపై విద్యార్థులు, యువత స్పందించేలా చైతన్యవంతమైన కవితలు, పుస్తకాలు రావలసిన అవసరం ఉందన్నారు. మాజీ ఏఐఎస్‌ఎఫ్ నాయకునిగా, అధ్యాపకుడిగా, రచయితగా సేవలు అందిస్తూ సమాజానికి ఉపయోగపడే పుస్తకాన్ని తీసుకురావడం హర్షణీయమన్నారు. దేశంలో జరుగుతున్న వివిధ ఉద్యమాలకు ఇటువంటి రచనలు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. అనంతరం రచయిత కట్టెల లింగస్వామిని పూర్వ ఏఐఎస్‌ఎఫ్ నాయకులు, మిత్రులు ఘనంగా సన్మానించారు.​ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల ప్రతినిధులు బచ్చనగోని గాలయ్య, జిల్లా యాదయ్య, బోరం ప్రకాష్ రెడ్డి, తాడూరి పరమేష్, బాతరాజు సత్యం, బోయ రామచంద్రం, లింగస్వామి, మల్లేష్, చిలకరాజు రాజు, సంజీవ, కొండూరు వెంకటేశం, తిగుళ్ల శ్రీనివాస్, కార్తీక్ గౌడ్, చింతల సాయిలు, ఎండి ఖయ్యూం, తడక మోహన్, కాకి సుందర్, వివిధ కళాశాలల ప్రతినిధులు విష్ణుకుమార్, మహేందర్ రెడ్డి, శ్రీనివాస్, శేఖర్ రెడ్డి, విద్యార్థిని విద్యార్థులు, వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

అక్షర సైన్యం.. ‘కలం కవాతు’!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News