సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని పంపాడ్ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కుస్నూర్ గ్రామానికి చెందిన కార్మికుడు విశ్వనాథ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు.తమతో కలిసి పనిచేసిన స్నేహితుడు మృతి చెందడంతో తోటి సహోద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో బుధవారం సహోద్యోగులంతా కలిసి రూ.36 వేల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్నేహితుడి కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచిన సహోద్యోగుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.
PRINT TIME: October 07, 2026 10:37 PM
కష్టకాలంలో తోడుగా నిలిచిన సహోద్యోగులు.. రూ.36 వేల సాయం

07-10-2026
43 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలంలోని పంపాడ్ మిషన్ భగీరథలో పనిచేస్తున్న కుస్నూర్ గ్రామానికి చెందిన కార్మికుడు విశ్వనాథ్ ఇటీవల గుండెపోటుతో మృతి చెందారు.తమతో కలిసి పనిచేసిన స్నేహితుడు మృతి చెందడంతో తోటి సహోద్యోగులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. విశ్వనాథ్ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో బుధవారం సహోద్యోగులంతా కలిసి రూ.36 వేల ఆర్థిక సహాయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో తమ వంతు సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు. స్నేహితుడి కుటుంబానికి కష్ట సమయంలో అండగా నిలిచిన సహోద్యోగుల సేవాభావాన్ని పలువురు అభినందించారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి